Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నమ్మక ద్రోహం - Written by Kumaraswamy


 నమ్మక ద్రోహం

రామాపురం అని ఒక పెద్ద ఊరు. ఆ ఊరిలో రవి, సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళు పండ్ల వ్యాపారం చేసేవాళ్ళు. సోము తనకు ఎంతో డబ్బు సంపాదించాలని కోరిక! కానీ దురాశ కలిగినవాడు, ఎక్కువ ధరకి పళ్ళను అమ్మేవాడు.  రవి  సోముకి  పూర్తిగా వ్యతిరేకం. రవి కష్ట జీవి, ఎంతో కస్టపడి రోజు తన వ్యాపారం నడిపించేవాడు. అందరితో మంచిగా మెలిగేవాడు. ఎప్పుడు రవి  షాప్ నిండా జనాలు పళ్ళు కొనడానికి వాస్తు ఉండేవాళ్ళు. ఇది చూసి సోము కుళ్ళుకునేవాడు. అతని షాప్ మూసుకోవాలి అని ఎన్నో పూజలు మొక్కులు మొక్కేవాడు. కానీ రవి కలిసినప్పుడు మిత్రునిలా నటించేవాడు. ఎక్కువ ధరకి పళ్ళు అమ్మడంతో సోము వ్యాపారం తగ్గిపోయింది . వ్యాపారంలో నష్టం చూసాడు. రవి అమాయకుడు ఉన్నదాంట్లో సంతృప్తి పడేవాడు. ఆలా ఇరవయి సంవత్సరాలు గడిచాయి.
ఒకరోజు పక్క ఊర్లో దొంగలు ఇళ్లలో పడి డబ్బు నగలు దోచుకు పోయారు అని రవికి సోముకి తెలిసింది. రవికి దొంగల వార్త తెలియగానే భయం వేసి న దగ్గర ఉన్న డబ్బు నగలు ఏమి చేయను! దొంగల బారి నుండి ఎలా కాపాడుకోవాలి అని సోముని అని సలహా అడిగ్గాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న సోము "దొంగల బెడద తగ్గే వారికి ధనము, డబ్బు ఎక్కడైనా దాచుదాం, నా దగ్గర కూడా కొంత ధనం ఉంది నేను ఊరి చివరన ఉన్న చెట్టు కింద పెట్టుకుంటా .. నువ్వు కూడా అలాగే చేయి " అని సోము రవికి సలహా ఇచ్చాడు. సోము మాటలు నమ్మి రవి తన దగ్గర ఉన్న సొత్తు అంత వాళ్ళ ఊరి అవతల ఉన్న రావి చెట్టుకింద గొయ్యి తవ్వి దాచాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా, తనకి గుర్తు ఉండేలా ఒక రాయిని పూడ్చిన గోతిపైన బెట్టి తిరిగి వచ్చాడు. రవి వెనకే వెళ్లి సోము ఆ డబ్బును, నగల్ని అంత తవ్వి తెచ్చుకున్నాడు. దొంగల బెడద తగ్గాక రవి సొమ్ము దాచిన రావి చెట్టు కింద తవ్వి చుస్తే సొమ్ము లేదు! రవి ఆశ్చర్యపోయాడు! డబ్బు నగలు ఏమై ఉంటాయి అని రవి ఆలోచిస్తూ దిగాలుగా ఉన్నాడు.
రవి భార్య సుందరి గమనించింది. ఏమైంది అని అడగగా జరిగిన విషయం అంత చెప్పాడు. సుందరికి తన భర్తని సోము మోసం చేసాడని అర్ధమైంది. రెండు రోజులు బాగా అలోచించి సోముని తెలివిగా దొరకబట్టాలి అని ఒక ఉపాయం ఆలోచించింది . మర్నాడు రవితో సోము దగ్గరికి వెళ్లి తాను చెప్పినట్టు చేయమంది.రవి సోము దగ్గరికి వెళ్లి " మిత్రమా! నాకు ఒక కల వచ్చింది! అని అన్నాడు. ఏమి కల అన్నాడు " నాకు కలలో ఒక దేవత కనబడి నేను డబ్బు నగలు దాచిన చోటుకి వెళ్లి పది రోజుల తర్వాత చూస్తే ఆ ధనంకు సరిపడా బరువుతో పదింతలు విలువైన ఆభరణాలుగా మారుస్తాను అని చెప్పింది వాటిని ఈ రోజు నుండి పది రోజులు ముట్టుకోకండి అని" చెప్పాడు. ఎలాగూ దొంగల బెడద తగ్గింది కదా పది రోజులయ్యాక వెళ్లి తెచ్చుకుంటాను అన్నాడు. "అవునా! సంతోషం మిత్రమా " అని ఏమి తెలియనట్టే తలా ఊపాడు సోము .
కానీ అక్కడ ధనం పదింతలు అవడం, మిత్రుడి కల నిజమని నమ్మాడు సోము. అక్కడ సొత్తు లేకుంటే ఎలా ? రవి ఇంటికి వెళ్ళిపోయాక , పదింతలు ధనం పై ఆశతో తాను దొంగిలించిన సొత్తుని మళ్ళి ఆ చెట్టు కింద పెట్టి వచ్చాడు . ఏమి ఎరగనట్టే రవితో మాములుగా ఉండేవాడు. ఆలా సోము ధనం చెట్టుకింద మళ్ళి తవ్వి పెట్టడం రవి అతని భార్య సుందరి అతని వెనకే వెళ్లి చూసారు. తమ సొమ్ము తాము తిరిగి తవ్వుకుని తెచ్చుకున్నారు. సోము పదింతలు నగలు అవుతాయి అని పది రోజులు లెక్క పెడుతూ కూర్చున్నాడు. రవికి మిత్రుడు ద్రోహం చేయడం బాధేసింది. పదోవ రోజు సోము ఒక్కడే వెళ్లి రావి చెట్టు కింద తవ్వాడు. ఎంత తవ్విన ఏమి దొరకలేదు.ఒక చిన్న పెట్టెలో ఒక చీటీ కనబడింది" మిత్రమా! నా డబ్బు నువ్వే దొంగిలించవని తెలుసు! నీలాంటి మిత్రుడితో బ్రతకడం ఎప్పుడు అపాయమే! అందుకే నేను వెళ్ళిపోతున్నాను! మోసం చేసే గుణాన్న్ని ఇక నైనా మార్చుకో, మంచిగా బ్రతుకు. "అని ఉంది.

Yorum Gönder

0 Yorumlar